Saturday, September 29, 2012

Serial Killers - III


ఎట్టకేలకి T. V. S. శాస్త్రి (ఉరఫ్ TV శాస్త్రి) అతని శిష్యుడు ముత్యాల రెడ్డి ఇంటిలో ప్రవేశించారు. గురూజీ డ్రాయింగు రూమే తనకి ఉండటానికి కావాలన్నారు. చివరికి, మార్పులు చేసి, దాని పైని గది ఆయనికి, శిష్యుడికి ఇవ్వడం జరిగింది. గురూజీ చాలా గణించి, ముత్యాలకి "ఆల్ ద బెస్ట్, proceed" చెప్పడం జరిగింది.

వచ్చిన అయ్యవార్లని, మొదటి రోజే నాయక్ తగులుకున్నాడు. శిష్య పరమాణువు తోటి,

నాయక్: గురువు గారు?
శిష్యుడు: (తన కేసి చూసి మాట్లాడుతున్న నాయక్ కేసి చూసి, తన వెనకాల చూసుకుంటూ, ఎవరూ లేకపోవడంతో, మళ్ళీ నాయక్ ని ఎగా దిగా చూసి) గురువు గారు ఇక్కడ లేరుగా! (ఇలా అని, ముందుకి వెళ్ళబోయాడు)
నాయక్: నేను అనేది మీ గురించే అయ్యవారూ!
శిష్యుడు: ఇదిగో బాబు, గురూజీ అంటే ఆయన (దూరంగా ముత్యాలతో మాట్లాడుతున్న గురువు గారిని చూపించి), నేను ఆయన శిష్యుడిని.
నాయక్: తప్పయ్యింది లే గాని అయ్యవారూ, ఇంతకీ మీరు ఈ ఊర్లోనే ఉంటారా?
శిష్యుడు: (కొంచెం స్వరం పెంచి) మేము ఇక్కడెందుకు ఉంటాం? మాది అమలాపురం.

-- 2 --
శిష్యుడు ఏదో అవసరం వచ్చి కిందకి వచ్చి వెతుకుతున్న గురువు గారికి, నాయక్ తో మాట్లాడుతున్న శిష్యుడు కనిపించాడు.

శిష్యుడు: అబ్బే, ఇది గురూజీ TVS కాదు, ఆయన వియ్యంకుడిది, ఆయన ఇక్కడేగా ఉంటాడు.
నాయక్: .....
శిష్యుడు: ఆయన్ని ఇప్పుడు TVS శాస్త్రి అని పిలవడం లేదు, ఆయన TVS అమ్మేసారు గా!
నాయక్: ...
శిష్యుడు: అబ్బే, ... (ఇంకా ఏదో చెప్పబోతున్నాడు)

ఇంతలో గట్టి గట్టి గా మాట్లాడుతున్న శిష్యుడి జబ్బ దొరకబుచ్చుకుని,

గురూజీ: ఉరేయ్, ఉరేయ్, ఉరేయ్ శు౦ఠా! ఊరు మారావు కదా అని  ఏమిటీ అపచారం? దరిద్రుడా, దరిద్రుడాని!?
శిష్యుడు: (నాయక్ తో...) కాస్త ఉండు (చెయ్యి చూపించాడు. గురువు గారి కేసి తిరిగి ..., ఉత్తరీయం సవరించుకుంటూ, దీర్ఘం తీస్తూ...) ఏమిటండీ!? (ఈ లోపులో అక్కడినించి నాయక్ ఉడాయించాడు).

TV శాస్త్రి: (లో వాయిస్ లో) ఉరేయ్ తలకి మాసిన వెధవాని, ఇలా ఎవడుబడితే వాడితో మాట్లాడితే నాలిక మీద వాక్సుద్ధి నిలబడద్దు రా? (ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తున్న శిష్యుడి తో ..., ఈ మాటు గట్టిగా) పద, సంధ్య వార్చుదువు గాని.

-- 3 --
వీళ్ళు వచ్చిన రెండు రోజులకి అనుకుంటా, "మొదలు లేని కధ" రచయిత సిఫార్సు చేసిన కుర్ర రచయిత వచ్చాడు. పాపం ఆయనకి ఖాళీ లేదట అందుకే ఇతనైనా బానే ఉంటుందని, ఇతన్ని పంపించారు. ముతక గోధుమ రంగు లాల్చి, తెల్ల  పాంటు వేసుకుని, అవే కార్బను ఫ్రేము కళ్ళద్దాలతో భుజానికి సంచీతో విచ్చేసాడు అతను. ఇంకా ఏమిటంటే, బుగ్గన కిళ్ళీ కూడా ఉంది.

కుర్ర రచయిత: వణక్కం (చేతులు జోడించి కొద్దిగా వంగి నమస్కరించాడు).

ముత్యాలు నమస్కారం పెట్టి కూర్చోమన్నాడు.

కుర్ర రచయిత: నాన్ బయిసిగాల్లీ (basically) ఒండు, కేరళ్ ఇంద. నన్ పేయెరు, మన్నవుజ్ (మనోజ్), తెంబి (తంబి) పెరియబాకరన్ (ప్రభాకరన్). నన్నింద ఫిల్మ్ ఇండస్స్త్రిల్లు తెంబి పేయెరు. (చాలా సార్లు బుర్ర పైకి కిందకీ ఊపుతూ చెప్తున్నాడు).

ఇంతలో ముత్యాల సెగట్రీ,

సెగట్రీ: తనని "తంబీ" అని పిలవమంటున్నాడు. (అయోమయం గా చూస్తున్న ముత్యాలు, గురూజీ తదితరులకి clarify చేసాడు).

తంబి: ఉ.. ఉ.. ఉ.. ఉ.. (నాలుగు సార్లు తల ఊపుతూ చెప్పాడు).

కొంచెం సేపు ఆ సీన్లో అందరూ అలాగే ఉండిపోయారు. ముందుగా తేరుకున్న ముత్యాలు,

ముత్యాలు: సర్లే గాని తంబీ, ఇప్పుడు మనం తీసే సీరియల్లు, (కళ్ళు పైకెత్తి తంబి కళ్ళల్లోకి చూసిన ముత్యాలకి అనుమానం వచ్చింది), మీకు తెలుగు తెలుసు కదా?

తంబి: స్వళ్ళపం ( వేళ్ళతో indicate చేసాడు. తల ఊపుతూ, continue చేయ్యమన్నట్టు చెయ్యి తిప్పాడు).

ముత్యాలు: మనం తీసే సీరియల్లు, పది వేల ఎపిసోడులు ఉండాలప్పా. మొదలు లేని కధకి ఎన్ని అవార్డులు, డబ్బులు వచ్చినయ్యో మనకి ఇంకా ఎక్కువ రావాల, ఏంటి? (తంబి మళ్ళీ తల ఊపాడు).

తంబి: (తలకాయి ఊపడం ఆప్చేసి) బయిసిగాల్లి ఒండు, స్తోయేరిన (స్టొరీ) మేళ్ళు (మలయాళం లోనా), ఊర్ (Or) తెలింగు (తెలుగు లోనా)? (Clarity  కోసమని మొట్ట మొదటి డవుటు అడిగాడు తంబి).

ముత్యం: (గురూగారి కేసి చూసాడు, గురూజీ తల అడ్డం గా ఊపాడు. ముత్యం తంబి కేసి తిరిగి ...) తెలుగు లో (చెప్పాడు).

ఆ ఈవినింగ్ చర్చలు ముగిసాక స్టోరీ ఒక రకం గా ఫైనలైజ్ అయ్యింది. ఇండస్త్రీ లో పేరున్న చక్రవర్తి హీరో గాను, దమయంతి హీరోయిన్ గాను settle అయ్యారు. మిగిలిన వాళ్ళని ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. స్టొరీ sittings లో తనని కూడా involve  చెయ్యాలన్నారు గురూజీ, ముత్యం "ఎంత మాట" అని ఒప్పేసుకోవడం జరిగింది.

మొత్తానికి, పూర్వ రంగం సిద్ధం అయ్యింది.
(సశేషం)

No comments:

Post a Comment