Saturday, September 29, 2012

Triangle (English సినిమా) (5/5)


నేను మొన్నీమధ్యనే చూసిన ఒక ఇంగ్లీషు సినిమా పేరు Triangle. మనిషికి మరణాన్ని మించిన భయం లేదు, ఎప్పటికీ ఉండబోదు కూడా. అసలు మరణం అంటే ఎందుకు భయం, చచ్చిన తర్వాత మళ్ళీ పుడతారట కదా? ఇలాంటివే నాకు ఉన్న కొన్ని doubts ని ఆ మధ్య ఎవరో పెద్దవారు ఒకాయన తీర్చారు. మనిషికి ఎంతమంది జ్ఞానులు చెప్పినా చావు తరవాత మళ్ళీ పుడతాననే నమ్మకం రాకుండా చేసాడట దేవుడు. ఎందుకంటే, చిత్తశుద్ది తో మోక్షం పొందటానికి ఎక్కడ ప్రయత్నించరోననిట! ఇదే మృత్యు రహస్యం అని చెప్పారాయన. చాలా బావుంది, explanation.

పుట్టిన ప్రతి జీవి తాలూకు మనసులో, పాత జ్ఞాపకాల ఎఫెక్టు ఉంటుందట కాని, ఆ జ్ఞాపకాలు మాత్రం ఉండవట. అందుకే ఒక రకం గా మనం ఇదివరలో ఏది కావాలనుకున్నమో, ఏది పొందలేకపోయమో, అదే మళ్ళీ కావాలని అనుకు౦టామట, ఏమి తెలియకుండానే. అయితే, ఇలాంటిదే విషయాన్ని ఒక ఇంగ్లీషు సినిమాలో చూడటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక రకం గా మన ఫిలాసఫీ ఎంత సార్వజనీనమో అనిపించింది.

సినిమాలో triangle అంటే, మూడు భుజాలు. ఆ మూడు భుజాలూ ఏమిటి అంటే, ఒకటి పుట్టుక, రెండు జీవితం,  మూడు చావు. ఈ మూడు లేనిదే triangle పూర్తి కాదని, మళ్ళీ పుట్టుక సాధ్యం కాదని అంతర్లీనం గా చెప్తుంది సినిమా. మనకి తెలిసిందేమిటంటే, పుట్టుక లేనిదే జీవితం గాని, చావు గాని సాధ్యం కాదు. ఒక క్షణమైనా బ్రతకందే, ఒక జీవి పుట్టిందని గాని, చనిపోయిందని గాని మనం అనలేము. అంటే, triangle లో, పుట్టుక మరియు జీవితం మిగిలిన రెండిటితో ముడిపడి ఉన్నాయని మనకి అనుభవం చెప్తుంది. అయితే, మరి చావు మాటేమిటి? చావు ఉంటె గాని పుట్టుక (మళ్ళీ), జీవితం సాధ్యం కాదా?

ఈ ప్రశ్నలకి ఒక beautiful commentary ఈ సినిమా. ఇవే కాకుండా చావుని తప్పించుకుంటే, ఏమి అవుతుంది అనేది కూడా ఈ సినిమాలో ఒక భాగం. Aoelus అనే ఒక గ్రీకు, చావుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతను అమరుడైనప్పటికి, అది ప్రకృతివిరుద్ధం కాబట్టి, అతనికి ఒక విచిత్రమైన శిక్ష విధిస్తారు దేవతలు. అతను, ఒక బండరాయిని, తోసుకుంటూ తోసుకుంటూ ఒక కొండ పైకి తీసుకు వెళ్ళాలి. అది పైకి వెళ్ళాక ఎలాగు దొర్లి పడిపోతుంది. మళ్ళీ అతను, కిందకి దిగి, మళ్ళీ బండరాయిని తోసుకుంటూ పైకి ఎక్కించాలి. ఇలా బతికినంత కాలం (ఎల్లకాలం) చేయ్యమనేది అతనికి వేసిన శిక్ష. అయితే, అతను చేసిన తప్పు ఏమిటి, ఈ శిక్ష ఏమిటి, రెండిటికి connection ఏమిటి అనేది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.

సినిమా గ్రీకు, ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వదు, పూర్తిగా ఈ రోజుల్లో నడుస్తుంది. ఒక single mother, తన పిల్లాడిని బాగా తిడుతూ (వదిలేసిన మొగుడి మీద కోపంతో) ఉండగా సినిమా స్టార్ట్ అవుతుంది. అతడిని స్కూల్లో దింపేసి, ఫ్రెండ్స్ తోటి, సముద్రం మీద షికారు వెళ్ళడానికి వెళ్తుంది. (ఫ్రెండ్స్ అంటే normal ఫ్రెండ్స్యే, boy friend అలా కాదు). సముద్రం లో కొంత దూరం వెళ్ళిన వాళ్లకి, ఒక అనుకోని తుఫాను లాంటిది వచ్చి, బోటు తిరగబడిపోతుంది. వీళ్ళల్లో, ఒక్కరు తప్ప అందరూ ఆ తిరగబడిన బోటు మీదే ఉంటారు, ఒకరి ఆచూకి తెలియదు.

ఆ సాయంకాలం అనుకుంటా, వాళ్లకి ఒక షిప్పు కనిపిస్తుంది. ఆ షిప్పు పేరే Aoelus. అందులో ఎవ్వరూ వీళ్ళకి కనిపించరు. అయితే, ఆ షిప్పులోనే ఒక కిల్లర్ ఉంటుంది. ఆ కిల్లర్ వీళ్ళందరినీ చంపడం (జనన మరణాల సినిమా కదా, కొన్ని చావులు తప్పవు), ఈ single mother చేతిలో ఆ కిల్లర్ చనిపోవడం జరుగుతుంది. అయితే, ఇప్పుడే ఒక అద్భుతమైన twist జరుగుతుంది. సరిగ్గా ఆ కిల్లర్ చెప్పినట్టే, అదే తిరగబడిన బోటు మీదు, తన ఫ్రెండ్స్, తనతో సహా మళ్ళీ షిప్పు మీదకి రావడం ఆ అమ్మాయి చూస్తుంది. Friends తనని చూడరు కాని.

ఈ సారి ఆ అమ్మాయి, తన friends ని సేవ్ చేద్దామనుకుంటుంది. వాళ్లకి మామూలు గానే కనిపిస్తూ ఉంటుంది. ఒక సారైతే, వాళ్ళు ఇద్దర్నీ చూసి షాక్ అవుతారు కూడా. అయితే, తను ఎంత ప్రయత్నించినా, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. పైగా, ఆ వచ్చిన రెండో అమ్మాయి, కిల్లర్ గా మారి వీళ్ళని చంపడం జరుగుతుంది. కిల్లర్ మళ్ళీ ఈ అమ్మాయి చేతిలోనే చచ్చిపోతుంది. అయితే, అందరూ పోయాక, మళ్ళీ తన ఫ్రెండ్స్ రావడం (తిరగబడిన బోటు మీద) కనిపిస్తుంది. ఈ సారి తన కొడుకుని కలుసుకోవడానికి, తను కిల్లరై ఇది ఫినిష్ చేసేస్తుంది.

తర్వాత కూడా సినిమా continue అవుతుంది, కాని ఇక్కడ ఒక సారి ఆపి నేను, నా analysis చెప్తాను.

ఇక్కడ ఆ అమ్మాయి తనకి తాను కనిపించడం అనేది, ఆ నౌకలో ఉన్న aoelus అఫ్ఫెక్టు. చావుని జయించిన వాడు, దేవుడి దృష్టిలో చనిపోయినట్టే, కాని triangle కోసమని తనని మళ్ళీ పుట్టిస్తాడు దేవుడు. దేవుడు మనిషి కోరికలు తీర్చడానికి, మళ్ళీ అదే పరిస్తితులని కలుగజేస్తాడని ఒక ఊహ. అదే triangle, మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుందట. ఆ పరిస్తితులలో, చిన్న చిన్న changes సీన్స్ లో చూస్తాము. ఒకడు (ఫ్రెండ్), ఫస్టు టైం ఆపిలు తినడం, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు, అరటి పండు తినడం లాంటి చిన్న చిన్న changes. ఇవన్నీ ఎందుకంటే, వాళ్ళ మిగిలిపోయిన చిన్న చిన్న కోర్కెలు సైతం తీర్చడం కోసం అన్నమాట. తన ఫ్రెండ్స్ మాత్రం ఇదే మొదటి సారి, ఇదే చివరి సారి అన్నట్టు ఉంటారు. చావుని తప్పించుకున్న ఈ అమ్మాయికి మాత్రం తన జ్ఞాపకం continue అవుతుంది, ఎందుకంటే చావుని తప్పించుకు౦ది కాబట్టి. 

మిగిలిన వాళ్ళు చావంటే భయపడితే, ఈమె భయపడదు. అలాగని సంతోషం ఉంటుందా అంటే, ఈ triangle నించి విముక్తి ఏది, దొరకదే? Friends కి కూడా విముక్తి త్వరగా రాకపోయినా, మళ్ళీ మళ్ళీ అదే పనులు చెయ్యాలి అనే స్మృతి తనని క్రుంగదీస్తూ ఉంటుంది. పైగా ఎన్నో సార్లు, తను, తన ఫ్రెండ్స్ చనిపోవడం కళ్ళారా చూస్తుంది. పైగా తనని తనే చంపుకోవలసి వస్తూ ఉంటుంది. ఇంతకూ మించిన శిక్ష ఏమైనా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు మనం గ్రీక్ దేవుళ్ళు వేసిన శిక్ష గురించి చెప్పుకోవచ్చు. అతనికి చావు లేకుండా ఉండటం అంటే, వృధా ప్రయాస అని తెలిసి  ప్రయత్నించడమే అని చెప్పదలిచారు, వాళ్ళు. ఈ సినిమాలో కూడా ఆ అమ్మాయి, తన ఫ్రెండ్స్ ని సేవ్ చెయ్యడానికి, ఇంటికి మరలి వెళ్ళిపోవడానికి వృధాగా ప్రయత్నిస్తుంది.

కొన్ని కొన్ని సీన్స్ లో ఆ అమ్మాయికి ఒక చోట, ఒకే అమ్మాయి (ఫ్రెండ్) చనిపోయిన శరీరాలు ఎన్నో గుట్టలుగా కనిపిస్తాయి. ఒక రూము లో, తన చేతి వ్రాత తో ఉన్న ఎన్నో కాగితాలు కనిపిస్తాయి. ఆ షిప్పు తనకి తెలిసినట్లు ఉంటుంది, కాని గుర్తుకు రాదు. ఒక చోట ఎన్నో sea-gulls (సముద్రం పక్షులు) కనిపిస్తాయి. ఇవన్నీ ఒకే సెల్ఫు (ఆత్మ), చనిపోయి, ఉన్న జ్ఞాపకం తుడుచుకోకుండా ఉంటె, జరిగేవన్నమాట. మొదటి సారి షిప్పు ఎక్కిన ఆ అమ్మాయికి, తన కీ-బంచ్ కనిపిస్తుంది, తనదే. అది ఆ కిల్లర్ గా ఉన్న అమ్మాయి పారేసుకున్నది.

ఇంకొక విషయ౦ ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఉన్న ఇల్లు, నేల అవన్నీ birth (పుట్టుక) కి సంకేతాలు. బోటు ఎక్కి సముద్రం లో వెళ్ళడం, జీవితమనే ప్రయాణం. బోటు తిరగబడి నౌక చేరడం మరణం. ఆ నౌక, ఇల్లు రెండూ రెండు సమాంతర ప్రపంచాలు (parallel worlds). ఒక చోట పుట్టాలంటే, ఇంకో చోట చావాలి, ఒక చోట చావాలి అంటే, ఇంకో చోట vacancy ఉండాలి. మొత్తం మీద ఆ triangle మటుకూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అందరి కోరికలూ తీరే వరకూ, ఎవరికీ మన అవసరం ఉండనంతవరకూ.

ఇందాక మొదట బోటు తిరగబడినప్పుడు, వీళ్ళకి దొరకని అమ్మాయికి, చావు తర్వాత మళ్ళీ ఈ triangle లో ఉండవలసిన అవసరం లేకపోయింది, అందుకే వీళ్ళకి కనిపించలేదు. ఈమెకి, తన ఫ్రెండ్స్ కీ మాత్రం ఉంది, అందుకే ఆ నౌక లోకి వెళ్ళారు.

తుఫాను లో ఉన్నామని తెలిసి, ఈమె ఫ్రెండ్ ఒకతను, బోటు నించి radio communication చేస్తాడు, అందులో ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. "కిల్లర్ అందర్నీ చంపుతోంది", అంటుంది, కట్టైపోతుంది. ఆ గొంతు ఈ నౌక లో ఉన్న ఈ అమ్మాయిదే. కిల్లర్ చనిపోయేముందు, ఏమి చెప్పిందో, తను కిల్లర్ గా మారి చనిపోయేముందు కూడా అదే చెప్తుంది. ఫ్రెండ్స్ ని సేవ్ చేద్దామనుకున్నప్పుడు, కిల్లర్ గురించి మళ్ళీ అదే radio communication ఇస్తుంది. వీళ్ళనించి దాక్కున్నప్పుడు, కీ-బంచ్ పడేసుకుంటుంది. మొదట నౌకలో చూసామని వీళ్ళు doubt పడింది కూడా ఈ అమ్మాయిని చూసే. మొదటి సారి చనిపోయిన ఒక ఫ్రెండ్, తనని ఈమె చంపడానికి try చేసి౦దంటాడు, అది అప్పడి వరకు ఉన్న కిల్లర్ అమ్మాయి, ఈమెనే. సినిమా చూస్తె అర్ధం అవుతుంది, స్క్రీన్-ప్లే అద్భుతం, స్క్రిప్టు దుర్భేద్యం.

అయితే, చివరికి షిప్పు లో చనిపోయిన ఈ అమ్మాయి, ఇంటికి చేరుతుంది. ఇంట్లో తనలాగే ఉన్న ఇంకొక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయి, తన కొడుకుని తిట్టడంతో, ఆమెని చంపి, కొడుకుతో సహా బయటికి వస్తుంది. (Already ఉన్న తల్లి, షిప్పు లో, తన చేతిలో ఇందాక చనిపోయిన కిల్లర్. మొదట చనిపోయిన కిల్లర్ ఇప్పుడు బహుసా తిరగబడిన బోటు మీద వెయిట్ చేస్తూ ఉండి ఉంటుంది).

అంటే triangle అంటే ఏంటంటే, ఎప్పుడూ ఒక అమ్మాయి నేల మీద, ఒక అమాయి బోటు లోను, ఇంకో అమ్మాయి షిప్పు లోను ఉంటారు. మొదట నేల మీదనించి బయలుదేరిన అమ్మాయి, చివరికి నౌకకి చేరుతుంది. నౌకలో చనిపోయిన అమ్మాయి, నేలమీదకి వచ్చి, మళ్ళీ తల్లి అవుతుంది (పుడుతుంది). పుట్టిన తర్వాత ఎలాగైనా సరే, బోటు ఎక్కి సముద్రం లోకి వెళ్తుంది. సముద్రం లోకి వెళ్ళింది, నౌక మీదకి ఎలాగైనా చేరుతుంది. నౌకలో చనిపోయాక, తిరిగి మళ్ళీ పుడుతుంది. వీళ్ళందరి తో బాటుగా, నౌకలో ఇంకో అమ్మాయి ఉండిపోతుంది, ఎందుకంటే చావుని మోసగించింది కాబట్టి. ఆ అమ్మాయికే ఈ triangle యొక్క repetition గురించి తెలుస్తుంది, మిగిలిన వాళ్లకి తెలియదు. తెలిసాకా, విధి బలీయం కాబట్టి, ఇంకా ఎందుకు ఉన్నాన్రా అనిపిస్తుంది.

చివరికి, తన కొడుకు తో కారు లో వెళ్తున్న ఈ అమ్మాయికి accident అవుతుంది. తను instant గా చనిపోతుంది, పిల్లవాడు చావుబతుకుల్లో ఉంటాడు. అయితే, ఇదంతా ఈమెనే ఇంకొకరిగా చూస్తూ ఉంటుంది. ఈమె ఎవరూ అంటే, ఇందాకా తిరగబడిన బోటు లోనించి నౌక లోకి వెళ్ళిన అమ్మాయి, ఆల్రెడీ ఉన్న కిల్లర్ లలో ఒకరు. చివరికి విషయాన్ని అర్ధం చేసుకున్న ఈమె (triangle నించి తప్పించుకోవడం అసాధ్యం), తిరిగి harbor కేసి వెళ్తుంది. అక్కడ సముద్రం మీద షికారని ఎంతో excited గా ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి, మళ్ళీ బయలుదేరుతుంది. పిల్లవాడు చనిపోతాడనేది, వీళ్ళ డైలాగుల్లో మనకి తెలుస్తుంది.

Symbolism: ఈ సినిమాలో యూస్ చేసిన సింబాలిజం, చాలా బావుంది. జనన మరణాలకి, జీవితానికి సంకేతాలుగా ఇల్లు, షిప్పు, బోటు వాడటం ఒకటి. Sea-gulls ఒకటి. ఇందులో, మనిషి చనిపోయే ముందుగా, ఒక Sea-gull చనిపోతుంది, ఈమె సముద్రంలోకి ఫ్రెండ్స్ తో వెళ్ళే ముందే ఒక Sea-gull సముద్రం లోకి వెళ్తుంది. ఈమె తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని crabs hatch అవ్వడం (పుట్టడం) చూబిస్తాడు. కొన్ని చోట్ల, "Come back soon", ఇలాంటి బోర్డులు, డైలాగులు ఉంటాయి.

మొత్తం మీద అద్భుతమైన సినిమా. వయోలెన్స్ అంటే మరీ వెగటు లేకపోతె, తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటివి మనకి ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో అనిపిస్తుంది చూస్తె.

No comments:

Post a Comment